మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు
స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు హల్లెలూయ (8)
1. ఘనత నొందిన ఎందరి చరితలో
మరణముతోనే ముగిసి పోయెను
మనుజ కొమరుడు యేసు మాత్రమే
మరణపు కోరలు త్రుంచివేసెను – త్రుంచివేసెను
2. యేసు దేహమును సమాధినుంచియు
ముద్రలు వేసి భద్రపరచినా
మూడవ రోజున మహిమతో లేచెను
మృత్యువు యేసుని ఆపగలిగెనా – ఆపగలిగెనా
3. మొదటివాడుగా తాను లేచెను
నమ్మిన వారిని సయితము లేపును
విశ్వాసికి బలము యేసు విజయమే
నిరీక్షణకు గురి పునరుత్థానమే – పునరుత్థానమే