వందనాలయ్యా– వందనాలయ్యా
వందనాలయ్యా– నీకే వందనాలయ్యా
యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయ్యా
వందనాలే…..వందనాలే……వందనాలే
1ఇంత వరకు కాచినావు నీకు వందనాలయ్యా
ఎంతో మంచిగా చూపినందుకు వందనాలయ్యా
అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా
నాన్న వలే నన్ను లాలించినందుకు వందనాలయ్యా
2కట్టుకొనుటకు వస్త్ర ములిచ్చావు వందనాలయ్యా
భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా
ఉండుటకు నివాసము ఇచ్చావు వందనాలయ్యా
అన్ని వేళలో ఆదుకున్నందుకు వందనాలయ్యా(వందనాలయ్యా)
3 వ్యాధి బాధలలో నెమ్మది నిచ్చావు వందనాలయ్యా
హస్తము చూపి స్వస్థపర్చినావు వందనాలయ్యా
పరమవైద్యుడా యేసయ్య వందనాలయ్యా
మా ఆప్త మిత్రుడా యేసయ్య వందనాలయ్యా(వందనాలయ్యా)
4 ఏడ్చినపుడు ఓదార్చి నావు వందనాలయ్యా
కన్నీళ్ళు తుడిచి కౌగలించినావు వందనాలయ్యా
చెయ్యి పట్టి నడుపుచున్నందుకు వందనాలయ్యా
పరమ తండ్రి నా యేసయ్య వందనాలయ్యా(వందనాలయ్యా)