వెలిగింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభు యేసురాకతో
పులకించె ప్రకృతి – పలికించె ప్రస్తుతి
happy happy Christmas
happy happy Christmas
1. రాజులరాజు ప్రభువుల ప్రభువు భువికేతెంచెనని
భూజనులకు బహుమానముగా ఇలలో జనియించెనని
పరమోన్నతుని ప్రసన్నత ఈ జగతిలో నిండెనని
వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయె పండెనని
2. దీనులగాచే దైవకుమారుడు పరమును వీడెనని
మనుష్యుకుమారుడై కన్య మరియ వడిలో పరుండెనని
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని