వెదకని నాకు దొరికితివి – నను రక్షింపను వెదికితివి యేసూ!
నను కరుణించితివి
1. నీ మార్గంబును తొలగితిని – నిన్నెరుగకయే మెలగితిని
కన్నులు గానక తిరిగితిని – మంటి నేనని మరచితిని ||వెద||
2. ఎంతగానో నను ప్రేమించి – ఈ లోకమునకు అరుదెంచి
దాసుని రూపము ధరియించి – నా పాపములను భరియించి ||వెద||
3. నాకై ప్రాణము బెట్టితివి – మధ్యగోడ పడగొట్టితివి
నీ మందిరముగ కట్టితివి – నీ కొమరునిగ నిలబెట్టితివి ||వెద||
4. నీ శక్తితో నను నింపుము – నీ పనికైనను బంపుము
నిత్యము నన్ను నడిపించుము – నీకు సాక్షిగా నుంచుము ||వెద||
5. ఆరాధింతును ఆశ్రయుడా – ఆత్మతోడ సత్యముతోడ
స్తుతియించెద నిను స్తోత్రార్హుడా – అద్వితీయుడా నా ప్రభువా ||వెదా||