వెదకుడి వెదకుడి – యెహోవాను వెదకుడి
సమయముండగనే – ఆయనను వెదకుడి
కృపకాలముననే ఆయనను వెదకుడి (2) “వెదకు”
1. ఆయన మీకు – దొరుకు కాలమున
నీ పూర్ణ హృదయముతో – ఆయనను వెదకినా
నీపై జాలితో – నిన్ను క్షమియించును –2
తరుణము పోయినా- మరల రాదు –2 “వెదకు”
2. తెల్లవారు జామున – నీ కంఠ స్వరముతో
ఉపవాసముతో – కన్నీటి ప్రార్థనతో
యెహోవాను వెదకిన – మోక్షము దొరుకును -2
తరుణము పోయినా – మరల రాదు –2 “వెదకు”
3. బాలుడైన యేసుని – జ్ఞానులు వెదికిరి
మగ్ధలేని మరియ – యేసుని వెదికెను
కన్నీటితో హన్నా – దేవుని వెదికెను -2
తరుణము పోయినా – మరల రాదు -2 “వెదకు”
4. హిజ్కియ వెదకి – ఆయుస్సు సంపాదించే
ఎస్తేరు వెదకి – తన వారిన్ రక్షించే
దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు -2
తరుణము పోయినా – మరల రాదు “వెదకు”