విశ్వాసీ ఓ విశ్వాసీ నిలబడియున్నావా
విశ్వాసీ నీ విశ్వాసములో జారిపోయావా ॥2॥
అంతము వరకు నిలబడు వాడే దీవెన పొందును ॥2॥
దైవ దీవెన పొందును ॥విశ్వాసీ॥
1॰అబ్రహమును చూడూ దేవుని మాట నమ్మెను
ఎక్కడికి వెళ్ళవలయునో తానెరుగకయే వెళ్ళెనూ ॥2॥
కుమారునీ బలినిచ్చుటకు వెనుతిరుగని విశ్వాసము చూడూ॥2॥
ఆ..విశ్వాసమే విశ్వాసులకు తండ్రిగా అతనిని మార్చిందీ ॥విశ్వాసి
2॰లోకమంతా పాడైనా నోవహు నీతిని చూడుమ
మాటెవ్వరు వినకపోయిన దేవుని మాటకు విధేయుడై ॥2॥
నిందలెన్నో భరియించీ ప్రభువు మాట నెరవేర్చెను చూడు ॥2॥
ఆ.. విశ్వాసమే కుటుంబానికి రక్షణగా మారిందీ ॥విశ్వాసీ॥
3॰యేసేపును దానియేలును
షద్రక, మేషకు, అబేద్నగోలును
ప్రాణాలర్పించుటకైన వెనుతిరగలేదు ప్రభు కొరకు ॥2॥
సింహముల బోనులో అగ్నిగుండములో వీరిని చూడూ ॥2॥
ఆ..విశ్వాసమే
దేశాధికారులుగా వీరిని మార్చిందీ ॥విశ్వాసీ॥