విశ్వాసం తో సాగితే సమస్తమును సాధ్యమే
క్రీస్తు లో నాకు కలుగును ఎల్లపుడు విజయమే
నే చేయు ప్రతి పని విశ్వాసంతో-పలికే ప్రతి మాట విశ్వాసంతో
నడిచే ప్రతి బాట విశ్వాసంతో-జీవించే ప్రతి క్షణం విశ్వాసంతో
ఎండినబ్రతుకును చిగురింప చేసి –ఫలింప చేయును విశ్వాసం
నిరాశ బ్రతుకుకు నిరీక్షణనిచ్చి-సమాధానం ఇచ్చును విశ్వాసం
కష్టనష్టములెన్నెదురైనా అలయక నేను సాగెదను
ఇబ్బందులు శ్రమలు ఇరుకులు వచ్చిన-జయించి నేను సాగెదను