వచ్చె వచ్చె తమ్ముడో – యేసు సామి వచ్చే వేళాయె సూడరో
మేఘాల పీఠమెక్కి – మెరుపోలె నింగికి
1. ఆళ్ళీళ్ళని లేకుండ ఆయనొంక చూస్తరు
భూజనులేసుని చూసి రొమ్ము కొట్టుకుంటరు
2. రెక్కల దూతలతో సక్కగ దిగివస్తడు
టక్కరోడు సాతాను కొమ్ములిరగదీస్తడు
3. భూతాలే కరిగిపోయి భూమి కాలిపోవును
ఆకాశం అంతలోనే ఆవిరిగా మారును
4. నమ్మి బతికున్నోళ్ళు నింగికెగిరిపోతరు
నమ్మి చనిపోయినోళ్ళు లేచి బయటికొస్తరు