విడువను నిను ఎడబాయనని
నా కభయ మొసంగిన దేవా – నా కభయ మొసంగిన దేవా
1. నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను||
2. పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను||
3. మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తోడిగితివయ్యా
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను||
4. సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించేదను ||విడువను||