శరణం శరణం నా ప్రియ యేసు
చెరితినయా నీ దరిని నా దేవా
1 ఎన్నో అఘము నొసరించితినీ
కన్నులే కానక చరియించితిని
మన్నించుటకే పాత్రుడను కాను
కనికర పూర్ణుడా కృపనే చూపుమ||శరణం||
2 చెడుగులతో జత చేసితిని
అడుగులు తడబడి నడయాడితిని
ఇడుముల పాలై పతనం నొందితిని
కడకే నా దరి శరణని చేరితి||శరణం||
3రక్షణ నొసగి పావన పరచి
అక్షయ భాగ్యము నొసగితివి
మోక్ష పదమ్మున నను నడిపితివి
రక్షకుడా గైకొనుమా వందనం||శరణం||
4 నమ్మితి నయ్య నీ చరణంబుల
నెమ్మది నొసగుము నా మదికి
నమ్మిన వారికీ ఆదరమిచ్చెడి
సమ్మతుడా నా సదముల విభూడా ||శరణం||