శుభవేళలో నీ మోమును చూసి – అర్పించెదను నన్నూ
ఆరాధన స్తుతి స్తోత్రములు – తండ్రీ నీకేనయ్యా “శుభవేళలో”
ఆరాధన – ఆరాధన – ఆరాధన – ఆరాధన
నా ప్రియ యేసునకే – పావనాత్మ ప్రభునకే
1. ప్రతిరోజును ప్రతి నిమిషము – నీ తలంపులతో నింపబడాలి –2
నా నోటి మాటలెల్ల – పరుల గాయములు, మా న్పాలి “శుభవేళలో”
2. నీ హృదయ ఆశలన్నియూ – హృదినాడిగా మారాలి – 2
జీవించు రోజులెల్లా – నీసాక్షిగా మారాలి “శుభవేళలో”
3. శుభవార్త భారం ఒక్కటే – నా హృదయ భారమై ఉండాలి – 2
నా దేశం అంచులెల్లా – నీ నామం ప్రకటించాలి “శుభవేళలో”