యేసయ్యా…యేసయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా
ఆశ్చర్యకార్యములు చేయువాడా
స్తుతియింతు మనసారా
నీవే నాకు ఆధారము నీవే నాకు ఆశ్రయము
నీవే నా…జీవం నీవే నా…సర్వం (2)
1.నీ నడకను నాకు నేర్పుమయా నిన్ను వెంబడించుటకు
నీ మాటలు నాకు నేర్పుమయా నిన్ను నే చాటుటకు
నీవే నా…జీవం నీవే నా…సర్వం (2)
2.ప్రార్ధించుట నాకు నేర్పుమయా అదియే నాకు బలం
నీ చిత్తములో నడుపుమయా అదియే బహుక్షేమం
నీవే నా…జీవం నీవే నా…సర్వం (2)
3.నీ ఆత్మతో నన్ను నింపుమయా నీ వలే నన్ను మార్చు
నీ మహిమను నాకు చూపుమయా
నిన్ను నే ఘనపరతు
స్తుతియూ…మహిమా…ఘనతా నీకే (2)