యేసయ్య నీనామము మహోన్నత నామము
యేసయ్య నీనామము అత్యున్నత నామము “2”
అన్ని నామములకన్న పైనామము యేసయ్య నీనామము
యుగయుగాలలో పూజింపదగినది యేసయ్య నీనామము “2”
1. ఆకాశమందున్నను భూమి పైనున్నను
పరలోకమందున్నను భూమిక్రిందున్నను
ప్రతివాని మోకాలు వంగాలి ప్రతినాలుక నిన్నే పొగడాలి – 2
యేసయ్య నీనామము సర్వశక్తిగల నామము
యేసయ్య నీనామము సర్వోన్నత నామము
2. పాపములోవున్న నిన్ను పరిశుద్ధునిగా మార్చును
శాపములోవున్న నిన్ను సంపూర్తిగా విడిపించును
ప్రతివారి దుఃఖము తొలగించును
ప్రతివారికి శాంతిని దయచేయును –2
యేసయ్య నీనామము అతిపరిశుద్ధ నామము
యేసయ్య నీనామము అత్యున్నత నామము
3. వ్యాధులలోవున్న నీకు స్వస్థత చేకూర్చును
నిట్టూర్పులలోవున్న నీకు ఓదార్పును ఇచ్చును
అపవాది సంకెళ్ళు విడగొట్టును ఆత్మాభిషేకము నీకిచ్చును – 2
యేసయ్య నీనామము అధికారము గల నామము
యేసయ్య నీనామము అత్యున్నత నామము