యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా
విశ్వమంతా నీ నామము ఘననీయము
1.నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగ మారెనే
నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
2.నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే
నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
3.నీవు వరునిగ విచ్చేయువేళ నా తలపుల పంట పండునే
వధువునై నేను నిను చేరగ యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||