యేసయ్య నామంలో – శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని
1. పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరిచే – శక్తి కలిగినది యేసయ్య నామం
2. రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
3. దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం
4. సృష్టిని శాసించే – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగే – శక్తి కలిగినది యేసయ్య నామం
5. పాతాళాన్నీ తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం