యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోట యేసయ్యా ప్రసన్నతలు పాడెదను క్రొత్త పాటగా పిలచి మలచి చెక్కినావు
నీ చేతితో ప్రజ్ఞా జ్ఞానాత్మతో ॥2॥
1॰మాట నేర్పరితనము వాక్ శక్తి లేని
నాలుక మాంధ్యము గల నోటిని ॥2॥
అగ్నివంటి నీమాటలు బోధించుటకు
వాడియైన ఖడ్గముగా నేనైతినీ ॥2॥ ॥యేసయ్యా॥
2॰జయశాలి నీ సేవలో వాడబడుటకు
శత్రువుల గుండెలో చొచ్చుటకు ॥2॥
అపవాది అగ్ని బాణాలార్పుటకు మెరుగుపట్టిన అంబుగా నేనైతినీ ॥2॥ ॥యేసయ్యా॥
3॰నీ కృప చేత నన్ను పిలచియుంటివి
భువియందు నీరక్షణసాధనముగా ॥2॥
అన్యులకు వెలుగై నీ మహిమగా
నీవునియమించినదీపమైతినీ ॥2॥ ॥యేసయ్యా॥