యెహోవా నన్ను కరుణించుమా
నా దేవా నన్ను దర్చించుమా
ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను
వేకువనే నీ కృపకై కనిపెడుతున్నాను
దినంతయు నేను ప్రార్థించుచు వున్నాను
1.విచారము చేత నా కన్నులు గుంటలై
వేదన చేత నా మనసు మూగదై
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నదీ
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను
2.అవమానం చేత.నా గుండెలు గాయమై
వంచన చేత నా ఊపిరి బారమై
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురుచూస్తూ ఉన్నదీ
దినంతయు నేను ప్రార్థించుచు వున్నాను