యెహోవా కొరకు ఎదురు చూడు మనసా
సిగ్గు నొందనియ్యడు నా తండ్రి నిన్ను
కష్టమైనా-కన్నీరైనా -ఓపికతో నీ పరుగును కొనసాగించు
1బలమైన హస్తంతో తన ప్రజలను విడిపించి
అరణ్యంలో తోడుండి-సముద్రంలో మార్గమేసి(2)
చేయిపట్టి వారిని ఆధారికి చేర్చిన
అన్నలచే అమ్మబడి అనాథగా అలమటించినా
2చెరసాల పాలై -చింతలలో మిగిలినా(2)
యేసేపుకు తోడుండి– బహుగా హెచ్చించినా(2)
3కఠినమైన హృదయంతో క్రీస్తుకు విరోదమైనా
మార్గాన్ని ఏర్పరిచి- అశాంతితో మసలినా(2)
ప్రేమతో దర్శించి సౌలును పౌలుగా చేసినా(2)