యెసే గొప్ప దేవుడు-మన యేసే శక్తిమంతుడు “2″
యేసే ప్రేమ పూర్ణుడు-యుగయుగములు స్తుతి పాత్రుడు “2″
అ.ప: స్తోత్రము, మహిమ, ఙ్ఞానము, శక్తి, ఘనతా, బలము కలుగును ఆమెన్ “2″ “యేసే“
1. మహ శ్రమలలో, వ్యాధి భాధలలొ-సహనము చూపి స్థిరముగ నిలచిన– యోబు వలె నే జీవించెదను “2″
అద్వితీయుడు ఆదిసంభూతుడు-దీర్ఘశాంతుడు ఆ ప్రభు యేసే….. “2″ “స్తోత్రము”
2. ప్రార్ధన శక్తితొ, ఆత్మ బలముతొ-లోకమునకు ప్రభువును చాటిన-
దానియేలు వలె జీవింతును
మహోన్నతుడు మన రక్షకుడు-ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే….. “2″ “స్తోత్రము”
3. జీవితమంతా ప్రభుతో నడచి-ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన-
హనోకువలె నే జీవించెదను “2″
అద్బుతకరుడు ఆశ్చర్యకరుడు-నీతి సూర్యుడు మన ప్రభు యేసే….. “2″ “స్తోత్రము”