యేసురాజుగా వచ్చుచున్నాడు – భూలోకమంత
తెలుసుకొంటారు రవికోటి తేజుడు రమ్యమైన
దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు
1.మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దు
లందరిని తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం
విడువబడుట బహు ఘోరం”యేసు“
2.ఏడేండ్లు పరిశుద్ధులకు విందు అవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది.. ఈ సువార్త
మూయబడును వాక్యమే కరువగును”యేసు“
3.వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక
రాజ్యాలన్నీ అయన ఏలును నీతి శాంతి వర్ధిల్లును
న్యాయము కనబడును”యేసు“
4.ఈ లోక దేవతలన్ని ఆయన ముందు సాగిలపడి
నమస్కరించి గడగడలాడును వంగని ప్రతి మోకాలు
యేసయ్య ఎదుట వంగిపోవును”యేసు“