రాజుల రాజా ప్రభువుల ప్రభువు
సర్వాధికారి నీకే వందనము (2)
1) ఆశ్చర్యకరుడవు నీవే ఆలోచన కర్తవు నీవే (2)
బలమైన దేవుడవు నీవే సమాధానకర్తవు నీవే (2) (రాజుల)
2) అబ్రహము దేవుడవు నీవే ఇస్సాకు దేవుడవు నీవే (2)
యాకోబు దేవుడవు నీవే ఆదరణ కర్తవు నీవే (2) (రాజుల)
3) మంచి కాపరి నీవే గొప్ప కాపరి నీవే (2)
ఆత్మల కాపరి నీవే ప్రధాన కాపరి నీవే (2) (రాజుల)
4) సృష్ఠికర్తవు నీవే పరిశుద్ధ దేవుడవు నీవే (2)
స్తుతులకు పాత్రుడవు నీవే యూదా గోత్రపు సింహము నీవే (2) (రాజుల)