లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా
రోషం ఉన్న సేవకులం రోషం ఉన్న విశ్వాసులం
1.ప్రజ్వలించే జ్వలలుగా ప్రకాశించే జ్యోతులుగా
ప్రవహించే ఊటలుగా ప్రహర్షించే జనములుగా
ఆరిపోని దివ్వెలుగా ఓడిపోని సైన్యముగా(2)
లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము
నడిపించు నడిపించు నడిపించు (2) రోషం ఉన్న ….
2శాంతినిచ్చే దూతలుగా సిలువమోసే వీరులుగా
సత్యమునకు బాటలుగా కాడిమోసే యోధులుగా
పరిమళించే తైలముగా క్రీస్తు యేసుని సాక్షులుగా (2)
లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము
నడిపించు నడిపించు నడిపించు(2) రోషం ఉన్న….