లోకమును జయించిన విజయము విశ్వాసమే – ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2
“లోకమును జయించిన”… హే
1. ఆవగింజంత విశ్వాసం – నీలో ఉంటే …. (హే) –2
కొండలైనా కదులును – సంద్రమైన చీలును
గాలైన అణగి దెయ్యమైనా వదలి – యేసునకే మహిమ తెచ్చును
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే… ఏ
2. నమ్మిన నీవు దేవుని – మహిమ చూస్తావు … (హూ)- 2
మృతులను లేపెడి – యేసు రాజే జీవము
మృతమైన లోక జనులను లేప – యేసు వలే సాగి పోవుదాం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే…. హే
3. లేని వాటిని ఉన్నట్టు – పిలుచును ప్రభువు….. (హూ )-2
విశ్వసించి పలుకుదాం – క్రియలను చూపుదాం
జీవవాక్కు పలికి ఆత్మ శక్తి చూపి – గొప్ప గొప్ప పనులు చేయుదాం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
4. నమ్ము వానికి సమస్తం – సాధ్యమే ప్రభుతో ….. (హో) – 2
ప్రభువు ఉన్నాడని – ఫలము ఇస్తాడని
నీకై ప్రాణం పెట్టి మృతి గెల్చాడన్న వార్త నమ్ము- నీదె జీవం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే –2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే… హే