బంధము నీవే స్నేహము నీవే
అతిధివి నీవెనయ్యా ఆప్తుడ నీవెనయ్యా నా యేసయ్యా
ప్రేమించువాడా కృపఁచూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా
కాలాలు మారిన మారనివాడా విడువవు నను ఎప్పుడు
కాలాలు మారినా మారనివాడా విడువవు నను ఎప్పుడు
మరువని తండ్రివయా నా యేసయ్యా
1.కారు చీకటి నను కమ్మువేళ వెలుగు నీవై ఉదయించినావా
నీ ఒడిలోనే నెమ్మదినిచ్చి కన్నీరు తుడిచావయ్యా
కౌగిల్లో దాచావయ్యా నా యేసయ్యా
2.మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా
హృదయ వీణవై మధురగానమై నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా
3.యీ లోకంలో యాత్రికూడను ఎవ్వరు లేని ఒంటరినయ్యా
నీవె నాకు సర్వము దేవా చాలును చాలునయా
నీ సన్నిధి చాలునయా నా యేసయ్యా
4.మోడుబారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా
నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలియించె నా జీవితం
ఆనందమానందమే నా యేసయ్యా