బెత్లెహేము ఊరిలో – పశులపాక నీడలోBy Jesussongs / బ బెత్లెహేము ఊరిలో – పశులపాక నీడలో ఉదయించె బాలుడు – రవికోటితేజుడు అ.ప. : ఆనందామానందామానందాం (4) 1. సింహాసనం విడచి – పరమ సౌఖ్యం మరచి నరులహృది భానుడై – ధరకు దిగె దీనుడై 2. మహిమరూపం మార్చి – మంటి దేహం దాల్చి పాపశ్రమ మోయను – శాపమును బాపను 3. తండ్రి చిత్తం నెరవేర్చ – పరిశుద్ధరక్తం కార్చ లోక ఇక్కట్లను తీర్చ – మరణశక్తిని హతమార్చ