భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి(2)
విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను(2)
మాట ఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోవునా(3)
1.ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని దిగులు ఏలనో
ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చు కొనవు
ఆయనే వాటిని పోషించుచున్నాడు”భయము”
2.తల్లి అయినా మరచినా మరువ వచ్చును, తండ్రి అయినా విడచినా విడువ వచ్చును
వారైనా మరచినా మరువవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను మరువకుందును”భయము”
3.ఆరోగ్యం లేదని కృంగుటేలనో, ఆర్థికంగా లేనని జడియనేలనో అడుగువాటికంటే
ఉహించువాటికంటే అత్యధికముగ ఇచ్చు ఏసుడుండగా చింత దిగులు మాని యేసు ప్రభును స్తుతించు”భయము”