భూమ్యాకాశములు-సృజించిన యేసయ్యా-నీకే స్తోత్రం “2″
నీ ఆశ్చర్యమైన క్రియలు-నేనెలా మరచిపోదును “2″
హలెలూయ లూయ… లూయ… హలెలూయా “4″
1. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి-విడిపించావు నన్ను
ధీనదశలో నేనుండగా-నను విడువనైతివి “2″
2. జీవాహారమై నీదు వాక్యము-పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా-నను తృప్తిపరచితివి “2″
3. భుజంగములను అణచివేసి-కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా-నను లేవనెత్తితివి “2″
4. నూతన యెరుషలేం నిత్యనివాసమని-తెలియజేసితివి
– నిట్టూర్పులలో ఉండగా-నను ఉజ్జీవపరచితివి “2″