భూనివాసులకు – ఈ లోక నివాసులకు
యేసే జీవం – యేసే సత్యం – యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు
1. పరిసరములలోని – పండిన పైరంతా
రాలిపోవు చుండ – సంతాపమే లేదా
కన్నెత్తిచూడు – కన్నీరు కార్చు
ఓ దైవ సేవకుడా – ఇకనైనా మేల్కొనవా “భూనివా”
2. పరమాత్మ ఆజ్ఞగని – ఆ యాత్మ స్వరమువిని
పౌలువంటి భక్తులు – ప్రాణాలు తెగియించిరి
దేవుని వాక్యము – దేదీప్యమానము
దీనుడవై యెపుడు – దీక్షతో చాటించు “భూనివా”
3. సువార్త భారమును – సంపూర్ణ భాద్యతతో
మోయాలి భోధకులు – చేరాలి గ మ్యాలు
దేవుని మార్గము – పూజనీయము
దివ్వెగ జీవించు – ధర్మము నెరవేర్చు “భూనివా”
4. సంఘమ మేల్కొనుమా – సాతానునెదిరించుమా
సర్వాంగ కవచమును – ధరియించి పోరాడుము
చీకటి త్రోవలో – సువార్త జ్యోతివై
జ్వాలను రగిలించు – రక్షణ ప్రకటించు “భూనివా”