నాధుడేసు తన్ను వెంబడించగా
పిలుచుకున్న ప్రియశిష్యుడా
సర్వమును వీడి యేసుతోడను
ముందుముందుకే సాగుమా
అ.ప. : సాగుమా యేసుతో – ముందుకే సాగుమా
1. నాగిటిపై చేయివేసి ఎన్నడూ – వెనుక తిరిగి చూడబోనని
శ్రమలు బాధాహింసలెన్ని కలిగినా – యేసునెపుడు వీడిపోనని
ముందాునున్న వాటి వైపు చూడుమా
వెనుకతట్టు చూడకుండ సాగుమా
2. ఎన్నికైనవెన్నెన్ని యున్నను యేసుకన్న మిన్నకాదాని
ఏది ఉన్నను లేకున్నను యేసు ఉన్న నాకు చాలని
ఉన్నతమగు యేసువార్త చాటుమా
సన్నుతించుచునెపుడు సాగుమా