నాతోడు నీడ నీవే దయగల యేసయ్యా
నా కొండ కోట నీవే కృపగల యేసయ్యా
మాటలో నీవేనయ్యా-పాటలో నీవేనయ్యా
మాటలో నీవేనయ్యా-తోటలో నీవేనయ్యా
గుండెలో నీవేనయ్యా-నీవే నా ప్రాణము
1.కష్టము నష్టము ఎదురైనా-కన్నుల నిండా వారైనా
చెరసాలలో బంధించినా-నిందలు అవమానములైనా
అడవిలోన యాత్రయైనా-కొనసాగింతును ఏమైనా”నాతోడు“
2.ఎవ్వరు ఏమని అనుకున్నా-నీ సహవాసం చేస్తున్నా
నేనునూ నా ఇంటివారును-నిన్నే ఆరాధించెదము
కుటుంబమంతా ఏకమై-నీ సేవచేతుము కడవరకు “నాతోడు“
3.కొండలు మెట్టలు దాటైనా-వాగులు వంకలు ఎదురైనా
పస్తులతోనే పడివున్నా-ప్రళయం నాకు ఎదురైనా
ఆత్మల భారం నాలోనా-నీ సేవచేతును ఏమైనా “నాతోడు“