నా జీవితం సమస్తము యేసయ్య కే –అంకితం
హల్లెలూయా –హల్లెలూయా-హల్లెలూయా – హోసన్నా
1.దిక్కు తోచని స్థితిలో-నేనుండినా
ప్రతికూల పరిస్థితులే-నాకెదురైనా
నీ చేయి చాచితివి-నా భారము తీర్చితివీ
యేసయ్య-యేసయ్య-నీవుంటే అది చాలయా
2.దినములు అన్ని ఇప్పుడు బహు ఘోరముల్.
కాలము గడుపుట అంటే అతి కష్టము.
నీ రెక్కల నీడలో-నా కాశ్రయమిచ్చితివి.
యేసయ్య –యేసయ్య-నీవుంటే అది చాలయా