నాగానం నా జ్ఞానం నాదేవా ఇది నీకోసమే
నా ప్రాణం నా సర్వం నాదేవా ఇది నీకోసమే
నాదేవా ఇది నీకోసమే …. !!2!!
1.సంగీతపు ప్రతి సరిగమలో నీనామం స్తుతియించెదను
రాగాల ఆలాపణలో నీనామం స్మరియించెదను !!2!!
నారాగం నాతాళం నాదేవా ఇది నీకోసమే !!2!!
2.నాదేహం దేవాలయముగా నీకింపుగా మలిచెదను
నాప్రార్ధన దూపార్చనగా నిముందర నిలిపెదను !!2!!
నాశ్వాస నాధ్యాస నాదేవా ఇది నీకోసమే !!2!!
3.నాఊహల ఆలోచనలో నిత్యము నిను ఘనపరచెదను
నాహృదయపు తలుపులు తెరిచి నిను ఆహ్వానించెదను-2
నాతనువు నా అణువు నాదేవా ఇది నీకోసమే !!2!!