నేనెళ్లపుడు యెహోవాను సన్నుతించెదన్(2)
నిత్యముఆయన కీర్తి నా నోటనుండున్(2)
అ.ప అంతా నా మేలుకే-ఆరాధన యేసుకే
అంతా నా మంచికే-(తన చిత్తమునకు తల వంచితే)-(2)
ఆరాధన ఆపను-స్తుతియించుట మానను(2)
స్తుతియించుట మానను
1.కన్నీళ్లే పానములైన-కఠిన ధుఃఖ భాధలైన
స్థితిగతులే మారిన-అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ-నిత్యుడైన తండ్రి ప్రేమ(2)
మారదు యేసు ఫ్రేమ-నిత్యుడైన తండ్రి ప్రేమ(2)
2.సంకల్పాన పిలుపొంది-నిన్నే ఫ్రేమించు నాకు
సమస్తము సమకూడి-మేలుకై జరుగును
యేసుని సారూప్యము-నేను పొందాలన్ని(2)
అనుమతించిన ఈ-విలువైన సిలువకై(2)
3.నీవు చేయునది-నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను-తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము-దుఃఖ కరమే(2)
అభ్యసించిన నీతి-సమాధాన ఫలమే(2)
4.చదువులే రాకున్నా-ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్నా -భూమికే బరువైనా
నా యెడల నీ తలంపులు-ఎంతో ప్రియములు
నీవుద్ధేశించినది నిష్పలము కానేరదు(2)