నేనేల భయపడవలెను-నేనెల చింతించవలెను
నా యేసుడు నాకుండగా-నన్నేది ఏమి చేయదు
నాలో నున్నది నీ ఆత్మ-నాలోప్రవహించుచున్నది నీ రక్తం
నా దేహములో నీ దేహం- ఇమిడి ఉన్నదీ ఆశ్చర్యముగా
1ఆకాశంభు విరిగిపడిన- ఆపదలెన్నో ఆవరించిన
అమరేశ్వరుడేసుడు అనుదినము-నన్ను విడువక నడిపించును గాన
2చచ్చిన చేపలు ప్రవహమునకు –యెదురుగా వెళ్ళ
నేరవుగా బ్రతికిన చేపనై బాహటముగా-శ్రమలకెదురు
నేగెదను గాన
3తరమ బడెడు దావీదునాడు-తరిమెడి సౌలుకు ఎదురాయెను
తరమబడినను తుదకు రాజుగా-దావీదు నిర్ణమాయెను గాన