Lyrics
నేను నిన్ను ఎరుగకుండి నాదేవా నీవు నన్ను
మరువకుంటివి నాపాపములు అతిక్రమములు
మబ్బు తొలగునట్లుగా తుదిచివేసియుంటివి
అ.ప: నీవు తప్ప యేసయ్యా-దేవుడెవర లేరయ్యా
విమోచించువాడవు నీవేనయ్యా
1.దారితప్పి తిరుగుచుండగా పేరుపెట్టి పిలిచియుంటివి జిగట దొంగ ఊబిలో కొట్టుకోనుచుండగా
లేవనెత్తి బండపైకి చేర్చియుంటివి
2. నీతిలేక బ్రతుకుచుండగా నన్ను కోరి వచ్చియుంటివి పాపముళ్ళ కంచెలో చిక్కుకోనియుండగా
చేయుచాపి విడుదలిచ్చి ఆదుకొంటివి
3. మరనదాస్యమందు ఉండగా ఋణమును చెల్లించియుంటివి భూమికంటే ఆకసం ఉన్నదెంత
ఎత్తుగా అంత అధికమైన కృప చూపుచుంటివి