నలుగకుండ గోధుమలు – కడుపు నింపగలుగునా
కరగకుండ కొవ్వొత్తి – కాంతి నివ్వగలుగునా
ఆత్మీయ యాత్రలో – నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో – కరుగుటయే వెలుగయా
1.పగలని బండనుండి – జలములు ఊరునా
విరుగని పొలము మనకు – పంటలివ్వగలుగునా
పరలోకయాత్రలో – పగులుటయే ఫలమయా
విశ్వాసి బాటలో విరుగుటయే వరమయా “నలు”
2.రక్తము చిందకుండ – పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ – కలుషములు కారుగునా
అంతిమ యాత్రలో – క్రీస్తేసే గమ్యమయా
బహుదూర బాటలో – ప్రభు యేసే శరణమయా “నలు”