నూతన యెరూషలేం నా గృహము
ఎప్పుడు వెళ్లి నే చేరెదను
రారాజు నగరమే ఆ పురము రమ్యమైన సీయోనే!
దాని ఉన్నత వాస స్థలము
చరణములు
1.స్పటికమువలె బంగారు వీధులు
ముత్యపు గుమ్మముల్ ఆ పట్టణముకు
ధగధగ మెరుయును దానిలో వెలుగు
దానిలో చేరుటే నా హృదయ వాంచ – నూతన
2.క్రీస్తు యేసే మూలరాయిగాను
అపోస్తులే పునాదుల రాళ్లగా కట్టిరి
అమూల్య రత్నములతో అలంకరింపబడె
ఆ రమ్య నగరమే నా నిత్యవాసం – నూతన
౩.దుఃఖము వేదన కన్నీరే లేదు
ఆ దేసమునందు మరణమే లేదు
నా ప్రతి బాష్పబిందువు తుడుచున్
నా దేవునితోనే కాపురముండెదన్– నూతన
4.ఆ నగరములో ప్రకాశించుటకు
సూర్యచంద్రులు దానిలో లేరు
గొఱ్ఱెపిల్ల ప్రభుయేసే దానిలో దీపము
పెండ్లికుమర్తెగా మహిమలో వసింతున్ – నూతన
5. సీయోను సౌందర్యం ఆ నగర మహిమ
సీయోనే శాశ్వత శోభాతిశయము
ఆ దివ్య పురములో చేర్చుము త్వరగా
ఆకాంక్షతో నేను కనిపెట్టి జీవింతున్ – నూతన