నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి
నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావాలి
నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదాయము నివ్వాలి
నీవున్న రీతిగానే – వట్టి పాత్రగానే
1. నీకున్న ధనధాన్యము అక్కరలేదు
నీదు అధికారము అక్కరరాదు
నీదు పైరూపము లెక్కలోనికి రాదు
నీదు వాక్చాతుర్యము పనికిరాదు
అ.ప. : నిన్ను నీవు తగ్గించుకొని – రిక్తునిగా చేసుకొని
విరిగి నలిగిన హృదాయంతో దైవసన్నిధి చేరాలి
2. నీకున్న జ్ఞానమంతా వెర్రితనము
నీకున్న ఘనతవల్ల లేదే ఫలితము
నీ గొప్ప పనులతో ఒరిగేది శూన్యము