నీ సిలువ శ్రమలు ధ్యానించాలని నీ సముఖములో తరించాలని
మాలిన్యమునకు దూరంగా – నీకిష్టమైన యాగంగా
జీవితం మలచుకోవాలనే పవిత్ర సాధాన దీక్ష
అ.ప. : ఇది సిలువ దీక్ష-స్వపరీక్ష
1. మానవపాపపరిహారార్థం భువికేతెంచిన నీవు
సిలువను మోసి మరణమునొంది నీపని ముగించినావు
నా సిలువను నేనెత్తుకొని – నన్ను నేను తగ్గించుకొని
నీ అడుగులలో నడవాలనే పవిత్ర సాధాన దీక్ష
2. లోక పాపాలగూర్చిన బాధతో రక్తమాయె నీ స్వేదం
గెత్సెమనెలో మోకాళ్ళపైన మ్రోగెను ప్రార్థననాదం
నా పాపక్రియలకొరకై నే – పశ్చాత్తాప హృదయముతో
ఆత్మీయ వసంతం పొందాలనే పవిత్ర సాధాన దీక్ష
3. పరోపకారమే ఆహారంగా ఇలలో జీవించినావు
ప్రేమ కలిగియుండుమని బోధించి మాదిరి చూపించినావు
శత్రువుకై ప్రార్థించిన – అందరికి మేలు చేసిన
నీ మనసు కలిగియుండాలనే పవిత్ర సాధాన దీక్ష