నీ సాక్ష్యం ఏది ?-నీ బలి అర్పణ ఏది?(2)
ప్రభు యేసు నంగీకరించి-నిద్రించెదవేల
ప్రభు యేసు నంగీకరించి-జాగు చేసేదవేల
మేల్కో-లెమ్ము(2)-రారమ్ము విశ్వాసి బి(1)
1.అపోస్తలుల కాలములందు- ఉపద్రవముల ఒత్తిడిలో(2)
అన్నింటి సహించుచు(2)-ఆత్మలాదాయము చేసిరి(1) {నీసాక్ష్యం}
2.రాళ్లతో కొట్టబడిరి-రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమొంది -సువార్తను చాటించిరి {నీసాక్ష్యం}
3. కొరడాతో కొట్టబడిరి -చేరసాలయందుంచబడిరి
చెరసాల సంకెల్లును-వారి నాటంక పరచలేదు {నీసాక్ష్యం}
4.సజీవ యాగముగ- ప్రభు సేవను జరిగించిరి
సువార్త ప్రబలమాయెను-సంఘము-స్థాపించబడె {నీసాక్ష్యం}
5.కోత విస్తాతరమెంతో- కోత కోయువారు కొందరే
యేసునిన్ పిలచుచుండె- త్రోసి వేసేదవా ప్రభు పిలుపున్ {నీసాక్ష్యం}
6.అర్పించేద నన్ను -ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకొని-నిన్నే వెంబడింతు నేను. |{నీసాక్ష్యం}
****