నీవు నన్ను ప్రేమించిన కారణము కనిపించదు
బ్రతుకంతా నిన్ను కొలిచిన నీ ఋణమెన్నడు తీరదు
అ.ప. : నీ ప్రేమ శాశ్వతము నను ఎడబాయదు ఏ క్షణము
1. యాకోబు రాహేలును ప్రేమించినా
మామయొద్ద కొలువు చేసి పెళ్ళాడినా
కొన్ని దినములకే ఆమెను కోల్పోయెను
చివరివరకు తనతో ఉంచలేకపోయెను
2. యోనాతాను దావీదును ప్రేమించినా
ప్రాణస్నేహితునిగా అతని భావించినా
క్షేమమున్నవేళ అతనితో ఉండెను
ఆపద కలిగినవేళ విడిచిపోయెను