నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యమునీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై –నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య “
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై –నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు “యేసయ్య”
3. నీవే వెలుగువై నీవే ఆలయమై – నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై –నను మైమరచి నేనేమి చేసేదనో “యేసయ్య”