నీకే గదా నేను చెబుతుంటా
నువ్వెందుకు నామాట వినవంట
నువ్వు తినేదానితోనే ఉన్నగాని తంటా
తీసుకుంటూ ఉంటావు వెంట వెంట
1. అరచేతిలో వంపి నలిపినలిపి దులిపి
వేళ్ళతోటి పట్టి పంటికింద పెట్టి
ముద్దముద్ద మాటలతో సతమతమవుతుంటావు
మొద్దువై ఏం చెయ్యలేక సతికిలబడుతుంటావు
2. తెల్లని పలువరుస ఎర్రబారిపోయె
మత్తుమందులతో దేహం బొత్తిగ చెడిపోయె
బాధలు మరవాలంటూ మత్తులోనే ఉంటావు
బాధలెక్కువైపోయి నెత్తికొట్టుకుంటావు
3. నీచమైన స్థితికి జారుస్తుంది వ్యసనం
మత్తుపదార్ధాలతో పొంచిఉంది పతనం
యేసుకు చెప్పావంటే విడుదల కలిగిస్తాడు
బలహీనతలన్నిలో విజయం నీకిస్తాడు