నీ కృప నిత్యముండును నీ కృప నిత్యజీవం.
నీకృప వివరింప నా తరమా యేసయ్య.
నీతిమంతుల గుడారాలలో
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము
1.శ్రుతిఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే.
కృతజ్ఞతనిచినావు కృపలో నిలిపేవు.
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా.
2.ప్రతి చరణం వెంట పల్లవి ఉన్నట్లే
ప్రతిక్షణమున నీవు పాలకరించావు
ప్రతికూలమైన పరిస్థితులన్నియు కనుమరుగైపోయేనే
3అనుభవ అనురాగం కలకాలమున్నట్లే.
నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు
రాజ మార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా