నిశ్చబ్దం వింత నిశ్చబ్దం క్రీస్తు నాలో పుట్టినరోజు
నా క్రిస్మస్ పండుగ రోజు నిజ క్రిస్మస్ పండుగరోజు
సర్వోన్నత మైనా స్తలములలో దేవునికి మహిమ
సకలచరా చరసృష్టిలొ సమాదానము ఆహా….ఆహా
1.నామోసపు తలపుల తలపై ముళ్ళుగుచ్చ బడినవి
నామోహపు చూపుల మోమిపై ఉమ్మివేయబడినది
నాచీకటి చేతులకాల్లకు శీలలు దిగగొట్ట బడినవి
కామక్రోద మదమత్సర దేహంలో బల్లెము దిగబడినది |నిశ్చబ్దం|
2.నాకూ నావారికి నేనూ వెలివేయ బడినాను
నాకూ లోకానికి నేనూ సిలువేయ బడినాను
వెలివేతలో సిలువ తోటలో మదురమై పోయాను
ఇల నాలోఇక జీవించేది నేను కాను క్రీస్తే |నిశ్చబ్దం|