నిను విడచి ఉండలేనయ్యా
నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2)
1.సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2)
సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2)
మోకరించి ప్రనుతింతును (2) ॥హల్లెలూయ॥
2.మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ
నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2)
వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2)
మోకరించి ప్రనుతింతును (2) ॥హల్లెలూయ|