నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ
అ.ప. : నీ ఆత్మతో నను నిండనీ – నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
1. నాలోపల సంచరించి – నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి – సరిగానడిపించి
నా జీవితం వెలిగించినావా – నీ రూపమే నాలో ముద్రించినావా
2. బలహీనతలను హరియించి – శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి – సత్యము బోధించి
నా భారమే భరియించినావా – నీ శాంతినే నాలో స్థాపించినావా
3. అనురాగముతో బంధించి – ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి – ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా – స్తుతిగానమే నాలో పలికించినావా