నా యేసయ్యా నీ జ్ఞానమూ అనంతమైనది
నేర్చుకొందునూ దీనమనస్సునూ నీ కాడిని మోయుచూ 1
అనుభవింతునూ నీ విశ్రాంతినీ అనుసరింతునూ నీ విశ్వాసమును 2
సాగిలపడెదన్ స్తుతియించుచూ సాగిపొదునూ చాటించుచూ 1
/నా యేసయ్యా /
1. అలసినవానిని ఊరడించు జ్ఞానమును
నీ శిష్యునికి మాటలు నేర్పుము ప్రభువా 2
తిరుగుబాటు చేయక నీతోనడిచెదనూ 2
వినుబుద్ది దయచేయుము దేవా
ప్రతి ఉదయము నేర్పుము ప్రభువా 1
/నా యేసయ్యా /
2.ఆజ్ఞల జాడను చూచి ఆనందింతును
దీవెనకై భక్తిని నేర్పుము ప్రభువా2
వెనుకకు చూడక నీకై బ్రతికెదనూ 2
స్వస్థబుద్ది దయచేయుము దేవా
ప్రతి దినము నడుపుము ప్రభువా1
/నా యేసయ్యా /
౩.అల్పకాలము పాపములో నుండక
బహుమతికై విశ్వాసము నేర్పుము ప్రభువా 2
నిందలకు భయపడక భాగ్యముగా ఎంచెదను 2
స్థిరబుద్ది దయచేయుము దేవా
ప్రతి క్షణము కాపాడుము ప్రభువా 1
/నా యేసయ్యా /