1.నా బాధలన్ని తొలగించినాడు – నా భారమే మోసినాడు
నా దుఃఖ దినములు సరిచేసినాడు – సంతోషమే ఇచ్చినాడు
తన కౌగిట చేర్చుకొని నా కన్నీటినే తుడిచినాడు…
నీ తల్లి మరిచినా… నే నిన్ను మరువను అని ఆభయమే ఇచ్చినాడు IIమంచిII
2.నా దీన స్థితిని గమనించినాడు – నా గాదనే మార్చినాడు
నే పడిన స్థితిని గుర్తించినాడు – తన చేతితో లేపినాడు
నా గాయములన్ని కడిగి – నన్నెంతో ప్రేమించినాడు
తన ప్రేమ చాటే ఓ గాయకునిగా తన స్వరమునే ఇచ్చినాడుIIమంచిII
3.నా పాప శిక్షను భరియించినాడు – నా పక్షమే నిలిచినాడు
నా కొరతలన్ని తను తీర్చినాడు – నా నింద తొలగించినాడు
నీ నడిగిన అన్నివేళలా – నా మనవి మన్నించినాడు
నే వెళ్ళు దారిలో – నా తోడు నడిచి – నన్నెంతో బలపరిచినాడుIIమంచిII