నా బ్రతుకు యాత్రలో …నా పాత్ర ముగిసిపోతే
తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే …
ఆనందమూ…సంతోషమూ…
పరిశుద్ధులందరితో సహవాసమూ(2)(నా)
1.ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే(2)
పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే(2)
జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా(2)
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా(2)(నా)
2.వలస వచ్చినా పక్షులు మనమధ్యనే నివసిస్తాయి
తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి (2)
పక్షి కంటే శ్రేష్టుడు మనిషి పరలోకం మరిచాడు(2)
తండ్రియైన దేవుని చేరే దారి మరచిపోయాడు(2)(నా)
3.తీర్చలేము దేవుని ఋణము ఏమిచ్చినా మనము
అర్పించు నీ దేవునికి నీ యొక్క జిహ్వఫలము(2)
నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు(2)
వెండి బంగారములైనా సాటి రాని సంపదలు(2)( నా)